Vachindamma

Subscribe to Pro to listen to this track. Go Pro
Know Why?

Vachindamma Lyrics

Geetha Govindam  by Sid Sriram

Song  ·  26,535,782 Plays  ·  4:10  ·  Telugu

Aditya Music

Vachindamma Lyrics

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా
దేవ దేవుడే పంపగా
ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట
బ్రహ్మ కళ్ళలో కాంతులే
మా అమ్మలా మాకోసం మళ్లీ లాలి పాడేనంట

(వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువై బొమ్మ)
(హారతిపల్లెం హాయిగ నవ్వే వదినమ్మ)
(వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కల రెమ్మ)
(నట్టింట్లోన నెలవంక ఇక నువ్వమ్మ)

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా

(సాంప్రదాయనీ శుద్ధపద్మిని ప్రేమ శ్రావణీ శర్వాణీ)
(సాంప్రదాయనీ శుద్ధపద్మిని ప్రేమ శ్రావణీ శర్వాణీ)

ఎద చప్పుడుకదిరే మెడలో తాళవనా
ప్రతి నిమిషం ఆయువునే పెంచెయినా
కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన
కలలన్నీ కాటుకనై చదివేనా
చిన్ని నవ్వు చాలే నంగనాచి కూనా
ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా
ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోన
నిద్ర చెరిపేస్తావే అర్థర్రాతిరైనా
ఏ రాకాసి రాశో నీది
ఏ ఘడియల్లొ పుట్టావె ఐనా

(వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువై బొమ్మ)
నా ఊహల్లోన ఊరేగింది నువ్వమ్మ
(వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ)
నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మ
ఏకాంతాలన్నీ ఏకాంతం లేక
ఏకరువే పెట్టాయే ఏకంగా
సంతోషాలన్నీ సెలవన్నది లేక
మనతోనే కొలువయ్యే మొత్తంగా
స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక
విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక
కష్టం నష్టం అనే సొంతవాళ్ళు రాక
కన్నీరొంటరాయే నిలువ నీడ లేక
ఎంతదృష్టం నాదేనంటూ
పగబట్టిందే నాపై జగమంతా
నచ్చిందమ్మ నచ్చిందమ్మ నచ్చిందమ్మ జన్మ
నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మ
మెచ్చిందమ్మ మెచ్చిందమ్మ నుదుటున కుంకమ బొమ్మ
ఓ వెయ్యేల్లాయుష్షంటూ దీవించిందమ్మ

తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా
అల్లి బిల్లి వెన్నపాల నురగలా
అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా

Writer(s): Gopi Sundar, Sri Mani<br>Lyrics powered by www.musixmatch.com


More from Geetha Govindam

Loading

You Might Like

Loading


4m 10s  ·  Telugu

Aditya Music

FAQs for Vachindamma