Sarasalu Lyrics

Shiva  by Mano, S. Janaki

Song   ·  1,930,265 Plays  ·  5:07  ·  Telugu

© 1989 Aditya Music

Sarasalu Lyrics

సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకానా వీలు కాదు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకానా వీలు కాదు
వంటిట్లో గారాలు ఒళ్ళంతా కారాలే సారు
చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు విరజాజి పూలు వంటిట్లో వాడరాదు
సూర్యుడే చుర చుర చూసినా చీరనే వదలడు చీకటే చెదిరినా
కాకులే కేకలు వేసినా కౌగిలే వదలను వాకిలే పిలిచినా
స్నానానికే సాయమే రావాలనే తగువా
నీ చూపులే సోకుగా కావాలనే సరదా
పాపిడి తీసి పౌడరు పూసి బైటికే పంపేయనా
పైటతో పాటే లోనికిరానా పాపలా పారాడనా
తియ్యగ తిడుతూనే లాలించనా
సరసాలు చాలు శ్రీవారు తాన నాన విరహాల గోల ఇంకానా ఊహు ఊహు

కొత్తగా కుదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా
ఎందుకో తికమక తొందర బొత్తిగా కుదురుగ ఉండనే ఉండడా
ఆరారగా చేరక తీరేదెలా గొడవా
ఆరాటమే ఆగదా సాయంత్రమే పడదా
మోహమే తీరే ఊతమే రాదా మోజులే చెల్లించవా
జాబిలే రాడా జాజులే తేడా రాతిరే రాదా ఇక
ఆగదే అందాక ఈడు గోల
చురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదు
ఉు
విరజాజి పూలు వంటిట్లో వాడరాదు
ఒహో
ఊరించే దూరాలు ఊ అంటే తియ్యంగ తీరు
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు
లలలలా లలలలా
హహహహ హహహ

Writer(s): Ilayaraja, Sirivennela Sitarama Sastry<br>Lyrics powered by www.musixmatch.com

5m 7s  ·  Telugu

© 1989 Aditya Music