
Nee Choopule Lyrics
Endukante Premanta by G.V. Prakash Kumar, K. S. Chithra, Haricharan
Song · 5,049,625 Plays · 6:01 · Telugu
Nee Choopule Lyrics
నీ చూపులే నా ఊపిరి
ఓసారిలా చూడే చెలి
అమవాసనై ఉన్నా మరి
అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసీచూడవెలా
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేశా పయనం
తదుపరి జన్మకైన జాలిచూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా
రోజూ కొత్తగా నీ సందర్శనం
ఆహా అన్నది నాలో స్పందనం
నిత్యం నువ్విలా నాకై చూడటం
ఎంతో వింతగా ఉందీ అనుభవం
నడివేసవిలో మరిగిస్తూనే మురిపిస్తోందే నీ చల్లదనం
ఎదమంటంతా దాచేస్తూ వెన్నెలయింది ప్రేమగుణం
నీకై వేచే నిట్టూరుపులే తూరుపు కానీ
నీ తలపులలో తలమునకవనీ ఎన్నో జన్మలని
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేశా పయనం
తదుపరి జన్మకైన జాలిచూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా
నీతో బంధమే రాసిందెవ్వరో
నిన్నే నాకిలా చూపిందెవ్వరో
నన్నీవైపుగా లాగిందెవ్వరో
నిన్నే చూడగా ఆపిందెవ్వరో
దరిదాపుల్లో పడిగాపుల్లో పడి నిలిచా నీరెడారుల్లో
తొలివెలుగల్లే వస్తాలే కలిసే రేపటి పొద్దుల్లో
నీ చూపులే నా ఊపిరి
ఓసారిలా చూడే చెలి
అమవాసనై ఉన్నా మరి
అందించవే దీపావళి
ఎందుకె చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా
కనుపాపలు వెతికే రేపటి వెలుగును చూసీచూడవెలా
నయనం హృదయం నీవే నీవై
సమయం వెనుకే చేశా పయనం
తదుపరి జన్మకైన జాలిచూసే వీలుందంటే
ఈ క్షణాన ఊపిరాపనా
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad<br>Lyrics powered by www.musixmatch.com
More from Endukante Premanta
Loading
You Might Like
Loading
6m 1s · Telugu