
Jabilli Kosam (Female) Lyrics
Manchi Manasulu by Ilaiyaraaja, S. Janaki
Song · 1,685,201 Plays · 3:47 · Telugu
Jabilli Kosam (Female) Lyrics
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మ నసక్కడ ఇన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్ననాడు నేనే లేను
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాలమాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది నా మనసొక నావైనది ఆ వెల్లువలో
ఈ వెల్లువలో ఏమౌతానో
ఈ వేగంలో ఎటుపోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను ఒడి చేర్చుతావో
నట్టేటముంచి నవ్వేస్తావో
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగా లమాలై పాడాలి నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై
Writer(s): Ilayaraja, Acharya Atreya<br>Lyrics powered by www.musixmatch.com
More from Manchi Manasulu
Loading
You Might Like
Loading
3m 47s · Telugu