Hylessa Lyrics
Sri Ramadasu by M. M. Keeravani , Devi Sri Prasad , Malavika
Song · 1,268,828 Plays · 4:17 · Telugu
Hylessa Lyrics
హోలేసా హోలేసా హోలేసా హోలే హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడా ఎడమకన్ను అదురుతోంది నీమీదొట్టు
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా
క్రిష్ణయ్యకు ఫించమైన నెమిలమ్మల దుంకులాట
దుంకులాట
దుంకులాట
ఎంకన్నకు పాలుదాపిన పాడావుల ఎగురులాట
ఎగురులాట
రామునికి సాయం చేసిన ఉడత పిల్లల ఉరుకులాట
ఉరుకులాట
చెప్పకనె చెబుతున్నవి చెప్పకనే చెబుతున్నవి
మన సీతరామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ
హోలేసా హోలేసా హోలేసా హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు
సెట్టుకి పందిరెయ్యాలని పిచ్చిపిచ్చి ఆశ నాది
ముల్లోకాలని కాసేటోణ్ణి కాపాడాలనే పిచ్చినాది
నీడనిచ్చే దేవునికే నీడనిచ్చే ఎదురుచూపు
ఇన్నాళ్లకి నిజమయ్యే వివరం కనబడుతున్నది
రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినట్టు
మన రాముని సేవకెవరో మనసుపడే వస్తున్నట్టూ
హోలేసా హోలే హోలేసా హోలేసా హోలేసా
ఏటయ్యిందే గోదారమ్మా ఎందుకీ ఉలికిపాటు గగురుపాటు
ఎవ్వరో వస్తున్నట్టు ఎదురుచూస్తున్నది గట్టు ఏమైనట్టు
నాకు కూడా ఎడమకన్ను అదురుతోంది నీమీదొట్టు
మన సీతారామసామికి మంచి ఘడియే రాబోతున్నట్టూ
హోలేసా హోలేసా హోలేసా హోలే హోలేసా
హోలేసా హోలేసా హోలేసా హోలే హోలేసా
హోలేసా హోలే హోలేసా హోలేసా హోలేసా
Writer(s): M.m. Keeravani, Suddhala Ashok Teja<br>Lyrics powered by www.musixmatch.com
4m 17s · Telugu