Chinna Thandri Lyrics
Sisindhri by Raj, Swarnalatha
Song · 579,654 Plays · 5:08 · Telugu
Chinna Thandri Lyrics
చిన్నితండ్రీ నిను చూడగా వేయికళ్లైనా సరిపోవురా
అన్ని కళ్లూ చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేనురా
అందుకే అమ్మఒడిలోనే దాగుండిపోరా
చిన్నితండ్రీ నిను చూడగా వేయికళ్లైనా సరిపోవురా
ఏచోట నిమిషం కూడా ఉండలేడు
చిన్నారి సిసింద్రీలా చిందు చూడు
పిలిచినా పలకడు, వెతికినా దొరకడ ు
మా మధ్య వెలిశాడు ఆ జాబిలి
ముంగిట్లో నిలిపాడు దీపావళి
నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు
చిన్నితండ్రీ నిను చూడగా వేయికళ్లైనా సరిపోవురా
అన్ని కళ్లూ చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేనురా
ఆ మువ్వగోపాలుడ్లా తిరుగుతుంటే
ఆ నవ్వే పిల్లనగ్రోవై మోగుతుంటే
మనసున నందనం విరియదా ప్రతిక్షణం
మా కంటి వెలుగులే హరివిల్లుగా
మా ఇంటి గడపలే రేపల్లెగా
మా ఈ చిన్ని రాజ్యానికి యువరాజు వీడు
చందమామా చుశావటోయ్ అచ్చం నీలాంటి మా బాబుని
నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే
చందమామా చుశావటోయ్ అచ్చం నీలాంటి మా బాబుని
Writer(s): Sirivennela Sitarama Sastry, Raj<br>Lyrics powered by www.musixmatch.com
More from Sisindhri
Loading
You Might Like
Loading
5m 8s · Telugu