Ammo Ammayena

Ammo Ammayena Lyrics

Vasantham  by S.A. Raj Kumar, Hariharan, Sujatha Mohan

Song  ·  3,239,548 Plays  ·  4:47  ·  Telugu

© 2003 Aditya Music

Ammo Ammayena Lyrics

అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
కనులారా నిన్ను చూస్తే
తెలిసిందే బ్రహ్మ కష్టం
ఇలలోన నిన్ను మించే
సిరిలేదే నగ్న సత్యం
నాలో ఏదో సవ్వడి
ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో
నన్నే మార్చినది
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా

నిషా కళ్ళతోటి వలే వేయకమ్మా
అరే చిక్కుకోదా ఎదే చేపలా
వయ్యారాల వైపు అలా చూడకయ్యా
సిరే కందిపోదా మరీ ఎర్రగా
నువ్వే కాని పువ్వు అయితే
నేను తుమ్మెదవుతా
నువ్వే కాలి మువ్వా అయితే
నేను రాగమవుతా
నిన్నే దాచుకుంటాలే
ప్రియా గుండె కోవెల్లోన
బాపు గీసిన బొమ్మకి
చెల్లివి నీవు చెలి
ప్రాణం పోసుకు వచ్చిన
పాటవు నీవు సఖి
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వసికైనా ఇంతందం సాధ్యమా

ప్రియా నిన్ను చూసి
మదే మారిపోయే
అదేం మాయోగాని వాన విల్లుగా
చెలి నిన్ను చేరి
ఎడారైన గాని
వసంతాలు జల్లే పూల వెల్లువా
నువ్వే నిద్దరోతే నేను
జోల పాటనవుతా
నువ్వే దగ్గరైతే హాయి
లోన తేలిపోతా
చెలి నువ్వు అవునంటే
సరాగాల సంబరమవుతా
నువ్వు నేను ఏకమై
ఇపుడే మనమౌదాం
నింగీ నేలా సాక్షిగా
ఎపుడు ఒకటౌదాం

అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వసికైనా ఇంతందం సాధ్యమా
కలలోనా నిన్ను చూసి
మనసారా కోరుకున్నా
ఇలలోనా ఇంతలోన
ఎదురైతే చేరుకున్నా
నాలో ఎదో సవ్వడి
ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో
నన్నే మార్చినది

Writer(s): Kula Sekhar, S.a.raj Kumar<br>Lyrics powered by www.musixmatch.com


More from Vasantham

Loading

You Might Like

Loading


4m 47s  ·  Telugu

© 2003 Aditya Music

FAQs for Ammo Ammayena