Alanati Ramachandrudu (From "Murari")

Alanati Ramachandrudu (From "Murari") Lyrics

The Prince  by Jikki, Sunitha Upadrasta, Sandhya

Song  ·  5,691,200 Plays  ·  5:21  ·  Telugu

Aditya Music

Alanati Ramachandrudu (From "Murari") Lyrics

అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అలనాటి రామచంద్రుడికన్నింట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి

తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా

పుత్తడిబొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన

అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడంది
తళతళ మెరిసిన ఆనందపు_తడి_చూపుల అక్షితలేయండి

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా

సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళిమండపాన
గౌరీశంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా

దేవుళ్ళ పెళ్ళివేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నెలమ్మా వెన్నెలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా

Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry<br>Lyrics powered by www.musixmatch.com


More from The Prince

Loading

You Might Like

Loading


5m 21s  ·  Telugu

Aditya Music

FAQs for Alanati Ramachandrudu (From "Murari")