Aidhurojula Pelli

Aidhurojula Pelli Lyrics

Varudu  by Mani Sharma, Ranjith, Sunandha, Malavika, Hemachandra, Jamuna Rani

Song  ·  764,697 Plays  ·  8:44  ·  Telugu

© 2010 Aditya Music

Aidhurojula Pelli Lyrics

ఐదురోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళి
తొలిచూపులే లేని తెలుగింటి పెళ్ళి
వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి
వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి
ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్లు శుభమస్తు నూరేళ్ళు

తుమ్మెదలాడె గుమ్మల జడలు
హంసలు ఊడే అమ్మల నడలు
నగలకు కందే మగువల మెడలు
పడుచు కళ్ళకే గుండెల దడలు
పారాణమ్మ కోవెల ముందు పసుపు రాటతో ధ్వజారోహనం
కళ్యాణికి అంకురార్పణం పడతులు కట్టే పచ్చతోరణం

ఇందరింతుల చేయి సుండరుడీ హాయి
తలకు పోసె చేయి తలపులొక్క వేయి
నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు
వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు

మగపెళ్ళి వారట నేమని వారట పెళ్ళికి తరలి వస్తున్నారట
కాఫీలు అడగరట, ఉప్మాలు ఎరగరట, వీరికి సద్దన్నమే ఘనమౌమో

వీరి గొప్పలు చెప్ప తరమా
బాండ్ మేళాం అడగరట, డోలు సన్నాయి ఎరగరట, వీరికి భోగ మేళం ఘనమౌమో

వీరి గొప్పలు చెప్ప తరమా
మగపెళ్ళి వారట నేమని వారట పెళ్ళికి తరలి వస్తున్నారట

ఇమ్మని కట్నం కోరి మేం అడగేలేదు ఇప్పటికైన F A B A చెప్పించండి
చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాల్మాకు దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి

కానుపూరు కండ్ల జోడు కావాల్మాకు దానికి తగిన రిస్టు వాచ్ ఇప్పించండి

ఇమ్మని కట్నం కోరి మేం అడగేలేదు ఇప్పటికైన F A B A చెప్పించండి

Country beauties ఎందరో
అడ్డ్రెస్సే ఇవ్వరా
చేస్కో love love marriage
Love love marriage
నచ్చె నచ్చె అచ్చ girlfriend ఎక్కడ ఏ ఎక్కడ
బోలో బాబుల marriage సై సై రా అంది నీ teenage

అది లబ్బొ దిబ్బొ గబ్బొ జబ్బొ మారేజి లవ్వు మారేజి
అది honeymoon అవ్వంగానే డామేజీ
ఎవరికి వారే యమునా తీరె పాకేజి తోక పీకేజి
అది అటో ఇటో అయ్యిందంటే దారెదీ కృష్ణ బారేజి
ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్లు శుభమస్తు నూరేళ్ళు
ఐదురోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళి
తొలిచూపులే లేని తెలుగింటి పెళ్ళి
వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి
వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి

చేదు కాదోయి తమలాకు ముక్క అందులో వెయ్యి సిరిపోగ సెక్క
సున్నమేసావో నీ నోరు పొక్క ఫక్కు మంటాది మా ఇంటి సుక్క
పచ్చ కర్పూర తాంబూలమిచ్చాక ఎక్కవచ్చోయి పూమల్లె పక్క

పంచుకొవచ్చు మా పాల సుక్క, పండుకోవచ్చు సై అంటె సుక్క
తెల్లవారాక నీ బుగ్గ సుక్క గుమ్మ తిలకాల గురుతైన లక్క
కడిగినా పోదు ఈ బంధమల్లూడో నిండు నూరేళ్ళదీ జంట అక్క

నిన్ను దీవించిన ఆడ బిడ్డ ఊరు దివిసీమలో నందిగెడ్డ
ఆడ పంతుళ్ళ అక్షింతలడ్డ మంచి శకునాలమే ఎంత సెడ్డ
మమ్ము కనిపెట్టు మా రాస బిడ్డ

తట్టలొ కూర్చుండ బెట్టిన వధువు నా గుమ్మడి పువ్వులో కులికెనొకటి
అది మంచు ముత్యమా మన వధువు రత్నమా

ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః
ధ్రువం త ఇంద్రాగ్నిశ్చ రాష్ట్రం ధారాయతాం ధ్రువం
ధర్మేచ, అర్థేచ, కామేచ త్వయాయేషా నాతిచరితవ్య నాతిచరామి
అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే
ఇంద్రపుత్రఘ్నీం లక్ష్మంతామస్మై సవితు స్సువః
అఘోర చక్షురపతిఘ్వేది శివా పతిభ్య స్సు మనా స్సు వర్చా
జీవ సూర్ధేవ కామాస్యోనా శంనో భవద్విపదే శంచతుష్టదే

Writer(s): Mani Sharma, Veturi<br>Lyrics powered by www.musixmatch.com


More from Varudu

Loading

You Might Like

Loading


8m 44s  ·  Telugu

© 2010 Aditya Music

FAQs for Aidhurojula Pelli