Aho Rama Katha (From "Veeranjaneya")

Aho Rama Katha (From "Veeranjaneya") Lyrics

The Great 60s - Golden Era Of Telugu Cinema  by S. Rajeswara Rao, Ghantashala

Song  ·  3,340 Plays  ·  3:19  ·  Telugu

© 2013 Saregama

Aho Rama Katha (From "Veeranjaneya") Lyrics

రామకథను వినరయ్యా.
రామకథను వినరయ్యా.
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా.

అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు.
ఆ రాజుకు రాణులు మువ్వురుకౌసల్య సుమిత్ర కైకేయి.
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు.
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
ఆ... ఆ... ఆ... ఆ... ఆ.
రామకథను వినరయ్యా.
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా.
ఘడియ ఏమి రఘురాముని విడచి.
గడుపలేని ఆ పూజని.
కౌశిక యాగము కాచి రమ్మని.
కౌశిక యాగము కాచి రమ్మని.
పలికెను నీరదశ్యాముని.
రామకథను వినరయ్యా.
తాటకి దునిమి జన్నము గాచి.
తపసుల దీవన తలదాల్చి.
జనకుని యాగము చూచు నెపమ్మున.
జనకుని యాగము చూచు నెపమ్మున.
చనియెను మిథిలకు దాశరథి.
రామకథను వినరయ్యా.

మదనకోటి సుకుమారుని కనుగొని.
మిథిలకు మిథిలయే మురిసినది.
ధరణిజ మదిలో మెరసిన మోదము.
ఆ... ఆ... ఆ... ఆ... ఆ.
ధరణిజ మదిలో మెరసిన మోదము.
కన్నుల వెన్నెల వీచినది.
రామకథను వినరయ్యా.

హరుని విల్లు రఘునాథుడు చేగొని.
ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది.
కళకళలాడే సీతారాముల.
ఆ... ఆ... ఆ... ఆ... ఆ.
కళకళలాడే సీతారాముల.
ఆ... ఆ... ఆ... ఆ... ఆ.
కళకళలాడే సీతారాముల.
ఆ... ఆ... ఆ... ఆ... ఆ.
కళకళలాడే సీతారాముల.
కన్నులు కరములు కలిపినవి.
రామకథను వినరయ్యా.
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా.

Writer(s): RAO S RAJESWARA, MALLADI, S RAJESHWARA RAO<br>Lyrics powered by www.musixmatch.com


More from The Great 60s - Golden Era Of Telugu Cinema

Loading

You Might Like

Loading


3m 19s  ·  Telugu

© 2013 Saregama

FAQs for Aho Rama Katha (From "Veeranjaneya")