Episode image

సత్వర న్యాయం. సమంజసమా? (Does speedy justice make sense?)

సమాచారం సమీక్ష - A Telugu News Podcast

Episode   ·  17 Plays

Episode  ·  17 Plays  ·  34:40  ·  Sep 30, 2021

About

గత కొద్ది సంవత్సరాలుగా మహిళలు బాలికల మీద జరుగుతున్న పెరుగుతున్న లైంగిక నేరాలు వేధింపులు హత్యలు అత్యాచారాలు. వీటిని అరికట్టే చట్టాలు ఉన్నా ,తరచుగా చూస్తున్న వింటున్న అనాగరిక డిమాండ్ సత్వర న్యాయం పేరుతో నేరస్థుడు అని అనుకున్న వారిని Encounter చేసి అయినా చంపాలి అని. న్యాయ విచారణ పద్ధతులను కాదని ఆటవిక న్యాయం కోరటం ఎంతవరకు సమంజసం? ఇలాంటి సంఘటనలు ఢిల్లీ నుండి గల్లీ దాకా అప్పుడప్పుడు చూస్తుంటాము. కొద్దిమంది ప్రజలు నాయకులనే వారు న్యాయం గురించిన అవగాహన లోపం లేదా vote bank politics కోసమో చేసే ఇలాంటి demands కి చట్టబద్ధత ఉండదు కదా? నిర్భయ లాంటి అనేక కొత్త పాత న్యాయ చట్టాలు తెచ్చినా మరణ దండన విధించిన నేరాలు తగ్గకపోవడం ఎందువల్ల? క్రైమ్ against women  NCRB 2019 report ప్రకారం ,రిపోర్ట్ అయిన కేసు లు 4లక్షల కు పైన ఉన్నాయి. రిపోర్ట్ కానివి లెక్క తెలీదు.కారణాలు అనేకం. సగటున రోజుకు 88 రేప్ కేసు లు . రిపోర్ట్ అయిన రేప్ కేసుల్లో  శిక్షలు పడినవి తక్కువే. దేశం లో 12yrs లోపు బాలికలపై జరిగే లైంగికదాడులు పెరిగాయి. న్యాయం దొరకటం లో సమయం పడుతుందని వంకతో అనుమానితులను న్యాయ రాజ్యాంగ మానవ హక్కుల పరిధి దాటి వెంటనే శిక్షించాలని అనుకోవటం ఎంత న్యాయం? ఆటవిక న్యాయం కోరటం కంటే ప్రభుత్వాలు పార్టీలు ప్రజలు మార్పు దిశగా చేపట్టాల్సిన పనులెంటి ? అనే అంశం పై  సమాచారం సమీక్ష హోస్ట్ D చాముండేశ్వరి తో మాడభూషి శ్రీధర్ ఆచార్యుల గారి interview డీన్  స్కూల్ ఆఫ్ లా  Mahendra UniversitySee sunoindia.in/privacy-policy for privacy information.

34m 40s  ·  Sep 30, 2021

© 2021 Audioboom