Shawasallo Shawaslle

Shawasallo Shawaslle Lyrics

Nee Thodu Kavali  by Valisha Babji

Song  ·  87,522 Plays  ·  5:56  ·  Telugu

© 2000 Aditya Music

Shawasallo Shawaslle Lyrics

శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే
నీడల్లే తోడల్లే నా గుండె జోరల్లే
ఓ చెలీ నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటూ నీవు వస్తుంటే
సాగరాన ఎగిసే అలవై దోబూచులాడేవు
కడలికి కన్నీటిని తరలించి
దప్పిక నా మనసుకి మిగిలించి
ఓ ప్రియా నా ప్రియా నను విడిచి పోయావె
నీ గమ్యం నీదంటూ ఎద గాయం చేశావె
ఓ ప్రియా నా ప్రియా నను విడిచి పోయావె
నీ గమ్యం నీదంటూ ఎద గాయం చేశావె

వాలిపోయిన పొద్దులో ఓ దీపమల్లె వెలిగి
రాలిపోయిన ఆశలన్నీ రేపి పోయినావే
పూయలేని ఓ పూల కొమ్మకు జీవమంటూ పోసి
ప్రాణమిచ్చి ఆ చిట్టి రెమ్మకు ధ్యానమయినావే
బ్రతుకే పచ్చ తోరణములా ప్రేమ సాగరములా
మార్చి వేసి నను విడిచిపోయినావే
నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని
నీడలా నడిచి రావాలని నాకు నీ తోడు కావాలని
అనుకుంటే ఓ ప్రియా నను విడిచి పోయావె
నీ గమ్యం నీదంటూ ఎద గాయం చేశావె
ఓ ప్రియా నా ప్రియా నను విడిచి పోయావె
నీ గమ్యం నీదంటూ ఎద గాయం చేశావె

రాతికైనా నేర్పించుకుంటే మాట పలుకుతుందే
కాటినైనా బతిమాలుకుంటే మంటలార్పుతుందే
ఏ నాటికైనా సరిదిద్దుకుంటే రాత మారుతుందే
ప్రేమలోన పడిపోయినాకే మనసు మారుతుందే
మనసే చంపుకొని నేను మరిచిపోయి నిన్ను
అడుగు తీసి ఆడుగేసి కదులుతుంటే
దూరమని నేను వెళుతూ ఉంటే దగ్గరకు మనసు లూగుతుంటే
దూరమని నేను వెళుతూ ఉంటే దగ్గరకు మనసు లూగుతుంటే
ఓ ప్రియా నా ప్రియా నను విడిచి పోయావె
నీ గమ్యం నీదంటూ ఎద గాయం చేశావె
ఓ ప్రియా నా ప్రియా నను విడిచి పోయావె
నీ గమ్యం నీదంటూ ఎద గాయం చేశావె

ఓ చెలీ నిన్ను నేను నాకు సొంతమనుకున్నాను
వసంతమై నడుచుకుంటూ నీవు వస్తుంటే
సాగరాన ఎగిసే అలవై దోబూచులాడేవు
కడలికి కన్నీటిని తరలించి
దప్పిక నా మనసుకి మిగిలించి
ఓ ప్రియా నా ప్రియా నను విడిచి పోయావె
నీ గమ్యం నీదంటూ ఎద గాయం చేశావె
ఓ ప్రియా నా ప్రియా నను విడిచి పోయావె
నీ గమ్యం నీదంటూ ఎద గాయం చేశావె

Writer(s): Bhasha Sree<br>Lyrics powered by www.musixmatch.com


More from Nee Thodu Kavali

Loading

You Might Like

Loading


5m 56s  ·  Telugu

© 2000 Aditya Music

FAQs for Shawasallo Shawaslle