Puttinodu Savaka Thappadu

Puttinodu Savaka Thappadu Lyrics

Puttinodu Savaka Thappadu  by Balu K Asura, Akhilesh Gogu

Song  ·  117,411 Plays  ·  5:42  ·  Telugu

℗ 2020 Lahari Recording Company

Puttinodu Savaka Thappadu Lyrics

పుట్టినోడు సావక తప్పదు సంపదనన్నది ఎందుకురా
మట్టిలోన కలవక తప్పదు రంగుల బంగులాలెందుకురా

పుట్టినోడు సావక తప్పదు సంపదనన్నది ఎందుకురా
మట్టిలోన కలవక తప్పదు రంగుల బంగులాలెందుకురా
యాడబోవు ఈ ప్రాణమో ఎందుకింత ఆవేదనో
కాలిపోయే ఈ కట్టెకే కక్షలంటూ ఎందుకురా
యాడబోవు ఈ ప్రాణమో ఎందుకింత ఆవేదనో
కాలిపోయే ఈ కట్టెకే కక్షలంటూ ఎందుకురా

పుట్టినోడు సావక తప్పదు సంపదనన్నది ఎందుకురా
మట్టిలోన కలవక తప్పదు రంగుల బంగులాలెందుకురా

సూటిపోటి మాటలతోని సూది లాగ గుచ్చుతుంటావురా
కష్టమొస్తే కన్నీరు తుడిశావు కాలయముడి లాగ నవ్వేవురా

గాయపడిన బతుకుల జూసి గురువింద గింజోలె ఉంటావురా
అవసరాలు తీరిపోయాక కసితీరా పగ తీర్చుకుంటావురా

మనసునిండ ద్వేషమురో మాట మార్చే తత్వమురో
ఎందుకింత ద్రోహమురో కళ్ళు తెరచి చూడవురో
మనసునిండ ద్వేషమురో మాట మార్చే తత్వమురో
ఎందుకింత ద్రోహమురో కళ్ళు తెరచి చూడవురో

పుట్టినోడు సావక తప్పదు సంపదనన్నది ఎందుకురా
మట్టిలోన కలవక తప్పదు రంగుల బంగులాలెందుకురా

ఒంటినిండా నగలాని అంటావు మెరిసేటి రత్నాలు ఏమాయెరా
పైస కోసం పరువును తీస్తావు ప్రాణాలు పోతుంటే సూస్తావురా

ఆస్తిలోన వాటాలు అంటావు కోటాలు దాటేటి మాటలురా
ఆకలి అంటే అన్నము పెట్టావు హుండీలో డబ్బులు వేస్తావురా

పుణ్యమంటే ఎట్లొస్తదో తెలుసుకోరా, ఓ నేస్తమా
సాయమన్నది చేస్తేనే స్వర్గముంటే పోతావురా
పుణ్యమంటే ఎట్లొస్తదో తెలుసుకోరా, ఓ నేస్తమా
సాయమన్నది చేస్తేనే స్వర్గముంటే పోతావురా

పుట్టినోడు సావక తప్పదు సంపదనన్నది ఎందుకురా
మట్టిలోన కలవక తప్పదు రంగుల బంగులాలెందుకురా

నమ్మి గొంతు కోసేటి మనుసుల నేనెట్లా నమ్మాలి నువ్ జెప్పరా
పక్కనుండి గోతులు తీసేటి పాపపు పుట్టక ఎందుకురా

మానవత్వమన్నది లేని రాతి మనసు నీకెందుకురా
ఇంకో జన్మ ఉన్నదో లేదో ఇప్పుడే హాయిగా ఉండాలిరా

వేళగాని వేళాయెరో కమ్ముకున్న మేఘాలురో
కానరాని తీరాలురో చేరలేని గమ్యాలురో
వేళగాని వేళాయెరో కమ్ముకున్న మేఘాలురో
కానరాని తీరాలురో చేరలేని గమ్యాలురో

పుట్టినోడు సావక తప్పదు సంపదనన్నది ఎందుకురా
మట్టిలోన కలవక తప్పదు రంగుల బంగులాలెందుకురా

Writer(s): Akhilesh Gogu<br>Lyrics powered by www.musixmatch.com


More from Puttinodu Savaka Thappadu

Loading

You Might Like

Loading


5m 42s  ·  Telugu

℗ 2020 Lahari Recording Company

FAQs for Puttinodu Savaka Thappadu