Pagale Vennela Lyrics - Pooja Phalam - Only on JioSaavn
What kind of music do you
want to listen to?

Want to hear the whole track?

Listen with no limits on the JioSaavn app.

I Have JioSaavn
  1. Pagale Vennela

    Pooja Phalam

    30s

    {"url":"https:\/\/preview.saavncdn.com\/749\/3d3fe178525332259cc05ecd7aaf614d_96_p.mp4","pid":"Pg0gRq4X","length":"182"}
  2. Pagale Vennela Song Lyrics

    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
    పగలే వెన్నెలా జగమే ఊయల
    కదలె వూహలకే కన్నులుంటే... ఏ.ఏ.ఏ... ఏ.ఏ.ఏ.
    పగలే వెన్నెలా జగమే ఊయల

    నింగిలోన చందమామ తోంగి చూచే... నీటిలోన కలువభామ పోంగి పూచే... ఏ.ఏ.ఏ.
    యీ అనురాగమే జీవనరాగమై...
    యీ అనురాగమే జీవనరాగమై... యెదలొ తేనేజల్లు కురిసిపోదా... ఆ ఆ ఆ ఆ
    పగలే వెన్నెలా జగమే ఊయల
    కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే...
    మురళిపాట విన్ననాగు శిరసునూపే...
    యీ అనుబంధమే మధురానందమై
    యీ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా... ఆ ఆ ఆ ఆ
    పగలే వెన్నెలా జగమే ఊయల

    నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
    పూలరుతువు సైగ చూచి పికము పాడే...
    నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే... పూలరుతువు సైగ చూచి పికము పాడే
    మనసే వీణగా ఝున ఝున మ్రోయగా
    బ్రతుకే పున్నమిగా విరిసిపోదా. ఆ ఆ ఆ ఆ
    పగలే వెన్నెలా జగమే ఊయల
    కదలె వూహలకే కన్నులుంటే ఏ.ఏ.ఏ... ఏ.ఏ.ఏ.
    పగలే వెన్నెలా...

    Writer(s): REDDY DR C NARAYANA, S. RAJESWARA RAO, DR. C NARAYANA REDDY, S RAJESHWARA RAO
    Lyrics powered by www.musixmatch.com

    Artists

    1. S. Janaki

      Singer

    2. S. Rajeswara Rao

      Music Director

    3. C. Narayana Reddy

      Lyricist