Okka Nuvvu Chaalu Lyrics

Mr. KK  by Ghibran , Anudeep Dev

Song   ·  229,737 Plays  ·  3:48  ·  Telugu

© 2019 Muzik 247

Okka Nuvvu Chaalu Lyrics

ఒక నువ్వు చాలు చెలి పూవుల మాసం
నవ్వు రంగు పులుముకోదా నా ప్రతి నిమిషం
ఒక్క జన్మ చాలాదులే నీ సహవాసం
మళ్ళి మళ్ళి జన్మిస్తా నీ జత కోసం
నువ్వు నా దైవం పంపిన ప్రియ సందేశం
నిండుగా నీలో ఉన్నది నా సంతోషం
పాపాలా చూసుకుంటా
కంటి రెప్పలో దాచుకుంటా
రావే నువ్వు నా రాణివంట
నీకే అంకితం ఊపిరంతా చివరంటా

తేనే కళ్ళ చూపులతో మాయ చేసావే
హాయి హాయి ఊహలలో ఊయలేసావే
ఆయువున్నదెందుకని గురుతుచేసావే
ఆనందాల అంచున మన పేర్లు రాసావే
నువ్వలా పక్కన ఉంటె చాలు కడవరకు
క్షణంలో అద్భుతమంటూ సాగిపోదా బ్రతుకు
పాపాలా చూసుకుంటా
కంటి రెప్పలో దాచుకుంటా
రావే నువ్వు నా రాణివంట
నీకే అంకితం ఊపిరంతా చివరంటా

నా జనుమకే అందం నీతో అనుబంధం
నీ మనసులో భాగం నే పొందిన యోగం
ఎండ వేడినంత నేనే స్వీకరిస్తానే
చందనాల జల్లు నీపై చిలకరిస్తానే
కాలమంతా నీ కొరకే కలలు కన్నానే
లోకమంతా ఏకమైనా నేను నీతోనే
చూపులో నీ ముఖచిత్రం ముద్రించుకున్నానే
నీ చుట్టూ ఆశల స్వర్గం నిర్మించుకున్నానే
పాపాలా చూసుకుంటా
కంటి రెప్పలో దాచుకుంటా
రావే నువ్వు నా రాణివంట
నీకే అంకితం ఊపిరంతా చివరంటా ... చివరంటా

Lyrics powered by www.musixmatch.com

3m 48s  ·  Telugu

© 2019 Muzik 247