Matanate (From "April 1St Vidudala")

Matanate (From "April 1St Vidudala") Lyrics

S.P. Balu & Chithra Telugu Hits  by Ilaiyaraaja, S.P. Balasubrahmanyam, K. S. Chithra

Song  ·  496,633 Plays  ·  5:00  ·  Telugu

© 2014 Aditya Music

Matanate (From "April 1St Vidudala") Lyrics

మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంట
రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా
నిజమంటే తంటాలంట నిక్కుతుంటె తిక్క దిగుతాదంట
మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట
గోపీ నా పక్కనుంటే భయమింక ఎందుకంట
ఎవరంటే నాకేమంట తప్పులుంటె ఒప్పనంట
నీ వెంటే నేను ఉంటా
చూస్తుంటా ఓర కంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంట
జనక్కు జుమ్మ
మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంట
మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట

నువ్వే మా మొదటి గెస్టని
మా ఆవిడ వంట బెస్టని
ఈ ఫీస్టుకు పిలుచుకొస్తినీ... టేస్టు చెప్పి పోరా
ఇదే మా విందుభోజనం
మీరే మా బంధువీదినం
రుచుల్లో మంచి చెడ్డలూ ఎంచి తెలుపుతారా
అపార్ధం చేసుకోరుగా
అనర్ధం చెయ్యబోరుగా
యదార్ధం చేదుగుంటది... పదార్ధం చెత్తగున్నది
ఇది విందా నా బొంద
తిన్నోళ్ళూ గోవిందా
జంకేది లేదింక నీ టెంక పీకెయ్యక పదర కుంక
నిజమంటే తంటాలంట నిక్కుతుంటె తిక్క దిగుతాదంట
మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట
గోపీ నా పక్కనుంటే భయమింక ఎందుకంట
ఎవరంటే నాకేమంట తప్పులుంటె ఒప్పనంట
నిజమంటే తంటాలంట నిక్కుతుంటె తిక్క దిగుతాదంట
రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా

భళారే నీలి చిత్రమా, భలేగా ఉంది మిత్రమా
ఇలా రసయాత్ర సాగదా పక్కనుంటే భామా
కోరావు అసలు ట్రూతును
చూపాను సిసలు బూతును
చిక్కారు తప్పుచేసి ఇక మక్కెలిరగదన్ను
తమాషా చూడబోతిరా
తడాఖా చూపమందురా
మగాళ్ళని అదిరిపడితిరా
మదించి మొదలు చెడితిరా
సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా
లాకప్పు పైకప్పు మీకిప్పుడే చూపుతా, బెండు తీస్తా
మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంట
రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంటా
నీ వెంటే నేను ఉంటా
చూస్తుంటా ఓర కంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంట
జనక్కు జుమ్మ
మాటంటే మాటేనంట కంటబడ్డ నిజమంతా అంట
మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంతారంట

Writer(s): Sirivennela Sitarama Sastry, Vennelakanti, Ilaiya Raaja<br>Lyrics powered by www.musixmatch.com


More from S.P. Balu & Chithra Telugu Hits

Loading

You Might Like

Loading


5m   ·  Telugu

© 2014 Aditya Music

FAQs for Matanate (From "April 1St Vidudala")