Kanulu Palukarincheniu Lyrics

Gudi Gantalu Ada Brathuku  by Viswanathan-Ramamurthy , P. B. Sreenivas

Song   ·  21,154 Plays  ·  4:04  ·  Telugu

© 2005 Saregama

Kanulu Palukarincheniu Lyrics

కనులు పలకరించెను పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను

నిన్ను నేను చూసే వేళా నన్ను నీవు చూడవేలా
నిన్ను నేను చూసే వేళా నన్ను నీవు చూడవేలా
నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేలా
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగి చూసెను
కనులు పలకరించెను పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను

మొలక నవ్వు దాచుకోకు జిలుగుపైట జారనీకు
మొలక నవ్వు దాచుకోకు జిలుగుపైట జారనీకు
కురులు చాటు చేసుకోకు తెరలు లేవు నీకు నాకు
తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూచెను
కనులు పలకరించెను పెదవులు పులకించెను
బుగ్గలపై లేతలేత సిగ్గులు చిగురించెను

అందమైన ఈ జలపాతం ఆలపించె తీయని గీతం
ఓహో హో ఓహో హో ఓహో హో ఓ ఓ ఓ
అందమైన ఈ జలపాతం ఆలపించె తీయని గీతం
కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగి చూచెను
కనులు పలకరించెను పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను

Writer(s): Manuel Tur<br>Lyrics powered by www.musixmatch.com

4m 4s  ·  Telugu

© 2005 Saregama