Aachintha Neekelaraa Lyrics

Subhodayam  by P. Susheela , K. V. Mahadevan

Song   ·  4,935 Plays  ·  4:09  ·  Telugu

© 1980 Saregama

Aachintha Neekelaraa Lyrics

మందార మకరంద మాధుర్యమునదేలు.
మధుపంబు పోవునే మదనములకు.
నిర్మల మందాకినీ వీచికల తూగు.
రాయంచ చనునే తరంగిణులకూ...
ప్చ్.అదిగాదు వాడక్కడ చేరి మొత్తం.
ఆ ఆ అ అ ఆ చింత నీకేలరా.
ఆ చింత నీకేలరా స్వామీ నీ చెంత నేనుండగా.
ఆ చింత నీకేలరా స్వామీ నీ చెంత నేనుండగా.
అ చింత నీకేలరా.
సొంతమైన ఈ సొగసులేలక పంతమేల పూబంతి వేడగ.
సొంతమైన ఈ సొగసులేలక పంతమేల పూబంతి వేడగ.
ఆ చింత నీకేలరా .
సరసాల మనుగడ సగపాలు చేసీ వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ.
సరసాల మనుగడ సగపాలు చేసీ వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ.
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నికరిగించి కౌగిళ్ళ తినిపించగా.
ఆ ఆ చింత నీకేలరా నీ చెంత నేనుండగా.
ఆ చింత నీకేలరా.
ఆ వంక ఆ వెన్నెలమ్మ ఈ వంక ఈ వన్నెలమ్మా.
ఆ వంక ఆ వెన్నెలమ్మా ఈ వంక ఈ వన్నెలమ్మా.
ఏ వంక లేని నెలవంక నేనమ్మ నీకింక అలకెందుకమ్మా.
చ్చ్.చ్చ్.చ్చ్... అయ్యో!
లలిత రసాల పల్లవకారియైచొక్కు .
కోయిల చేరునే కుటజములకు .
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర .
మరుగునేసాంద్ర నిహారములకు .
వినుత గుణశీల మాటలు వేయునేలా ఆఆ...
ఆ చింత నీకేలరా స్వామీ నీ చెంత నేనుండగా.
ఆ చింత నీకేలరా.

Writer(s): K V MAHADEVAN, VETURI SUNDARA RAMAMURTHY<br>Lyrics powered by www.musixmatch.com